![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -805 లో... కావ్య బాధపడేలా ధాన్యలక్షి మాట్లాడుతుంది. కావ్య తప్పేం లేదని తెలిసి సారీ చెప్పడానికి తన దగ్గరికి వెళ్తుంది. నిజం తెలుసుకోకుండా నిన్ను అనవసరం గా బాధపెట్టాను.. నన్ను క్షమించని ధాన్యలక్ష్మి అనగానే అలా అనొద్దు చిన్న అత్తయ్య.. మీరు నాపై కోప్పడ్డేది అందరూ చూసారు కానీ మీరు అప్పుపై ప్రేమతో అలా చేశారు.. ఒక అక్కగా మీరు నా చెల్లిని హ్యాపీగా చూసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉందని కావ్య అంటుంది.
ఇక నుండి నన్ను కూడా అప్పులాగే చూసుకోండి అని ధాన్యలక్ష్మి భుజంపై వాలుతుంది కావ్య. ఆ తర్వాత ఎలా కళావతి గారికి నాపై ప్రేమని ఎలా బయటపెట్టాలని రాజ్ ఆలోచిస్తుంటే అతనికి ఒక ఐడియా వస్తుంది. నేను అమెరికా వెళ్తున్నట్లు యాక్టింగ్ చేస్తాను. అప్పుడు దూరంగా వెళ్తున్నానని బయటపడొచ్చేమోనని రాజ్ అనుకొని తన ఫ్రెండ్ కి కాల్ చేసి ఏదో చెప్తాడు. ఆ తర్వాత యామినికి రుద్రాణి ఫోన్ చేసి.. నువ్వు రాజ్ దగ్గరికి వెళ్లి కావ్య ప్రెగ్నెంట్ అని చెప్పమని సలహా ఇస్తుంది. రాజ్ దగ్గరికి యామిని వెళ్తుంది. తన ఫోన్ చూస్తుంది అందులో ఫ్లైట్ టికెట్ ఉంటుంది. ఏంటి బావ అమెరికా వెళ్తున్నాడా అని అనుకుంటుంది. రాజ్ రాగానే ఎందుకు బావ అమెరికా వెళ్తున్నావని అడుగుతుంది. యామినికి యాక్టింగ్ అని తెలియకూడదని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత రుద్రాణి హాల్లోకి వచ్చి రాజ్ అందరికి దూరంగా అమెరికా వెళ్తున్నాడటా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు.
కావ్య నువ్వే ఎలాగైనా వాడిని ఆపగలవని ఇంట్లో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. ఏం చెప్పి ఆపను.. నేను ఆగమంటే తన ప్రేమని ఒప్పుకున్నట్లవుతుందని కావ్య ఎమోషనల్ అవుతుంది. తరువాయి భాగంలో రాజ్ వెళ్తుంటే రుద్రాణి ఎదరుపడి కావ్య ప్రెగ్నెంట్ అని చెప్పగానే రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత రాజ్ దగ్గరికి కావ్య వచ్చి.. మీకొక విషయం చెప్పాలంటుంది. మీరు ప్రెగ్నెంటా అని రాజ్ అనగానే కావ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |